విప్రో లాభం 24 శాతం జంప్.. మూడో క్వార్టర్​లో రూ.3,354 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ విప్రో గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈసారి నికరలాభం ఏడాది లెక్కన 24.4 శాతం పెరిగి రూ.3,354 కోట్లకు చేరింది. ఈ బెంగళూరు కంపెనీకి రూ.22,319 కోట్ల రెవెన్యూ వచ్చింది. 

అయితే రాబోయే క్వార్టర్​ రెవెన్యూ రూ. 22,5301 కోట్ల  వరకు రావొచ్చని విప్రో తెలిపింది. మూడో క్వార్టర్​ రెవెన్యూతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ. ప్రతి షేరుకు రూ.ఆరు చొప్పున కంపెనీ ఇంటెరిమ్​డివిడెండ్​ ప్రకటించింది. డిసెంబరు క్వార్టర్​లో బిలియన్​ డాలర్ల విలువైన 17 భారీ డీల్స్​ను పూర్తి చేసినట్టు విప్రో ప్రకటించింది.