విప్రో రూ. 12 వేల కోట్ల షేర్ల బై బ్యాక్

విప్రో రూ. 12 వేల కోట్ల షేర్ల బై బ్యాక్

బెంగళూరు: విప్రో రూ. 12 వేల కోట్ల షేర్ల బై బ్యాక్​ ప్రకటించింది. 26.96 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్​కు రూ. 445 చొప్పున  బై బ్యాక్​ చేసేందుకు డైరెక్టర్ల బోర్డు గురువారం ఓకే చెప్పింది. షేర్ల బై బ్యాక్​ ప్రోగ్రామ్​లో కంపెనీ ప్రమోటర్లు పాల్గొనడానికి ఆసక్తి చూపించినట్లు కంపెనీ వెల్లడించింది.  మరోవైపు మార్చి క్వార్టర్లో కంపెనీ లాభం 0.4 శాతం తగ్గి రూ. 3,074.50 కోట్లుగా రికార్డయింది.

మార్చి 2023 క్వార్టర్లో విప్రో రెవెన్యూ 7.1 శాతం ఎగిసి రూ. 23,190.30 కోట్లకు చేరింది. ఇక మార్చి 2023 తో ముగిసిన పూర్తి ఫైనాన్షియల్ ఇయర్లో కంపెనీకి రూ.90,487.60 కోట్ల రెవెన్యూపై రూ. 11,350 కోట్ల నికరలాభం వచ్చింది. అంతకు ముందు ఫైనాన్షియల్​ ఇయర్​తో పోలిస్తే రెవెన్యూ 14.40 శాతం, నికర లాభం 7.10 శాతం పెరిగాయి.

ఐటీ సర్వీసుల బిజినెస్​ రెవెన్యూ ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లో 2,753 నుంచి 2,811 మిలియన్​ డాలర్ల దాకా ఉండొచ్చని గైడెన్స్​ను  ప్రకటించింది విప్రో..