
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలంలో చేపూర్, చేపూర్కాలనీలో గురువారం రాత్రి దొంగలు దాదాపు 35 వ్యవసాయ బావి మోటార్ల నుంచి కాపర్ వైర్లను కత్తిరించి చోరీ చేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం పంటలకు నీరందించేందుకు వెళ్లే సరికి వైర్లు కత్తిరించి ఉండటంతో పంటలకు నీరు అందించలేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల వ్యవధిలో 75 వ్యవసాయ బావి మోటర్లకు చెందిన వైర్ చోరీ జరిగిందని రైతులు తెలిపారు. చోరీల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.