Wisden: ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు.. ఆల్ టైమ్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11 ప్రకటించిన విజ్డెన్

Wisden: ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు.. ఆల్ టైమ్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ 11 ప్రకటించిన విజ్డెన్

విజ్డెన్ ఆల్-టైమ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించింది. 11 మందితో కూడిన  జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లు స్థానం సంపాదించారు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలకు చోటు కల్పించింది. వెస్టిండీస్ నుంచి గేల్, ఫిలో వాలెస్ ప్లేయింగ్ 11 లో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తో పాటు దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ ను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా నుంచి కల్లిస్, న్యూజిలాండ్ నుంచి కైల్ మిల్స్ , శ్రీలంక నుంచి ముత్తయ్య మురళీ ధరన్, జింబాబ్వే నుంచి అండీ ఫ్లవర్ చోటు సంపాదించారు. 

ఓపెనర్లుగా ఫిలో వాలెస్, శిఖర్ ధావన్ లను ఎంపిక చేసింది. వాలెస్ ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్ ల్లోనే 73 యావరేజ్ తో 222 పరుగులు చేశాడు. మరోవైపు శిఖర్ ధావన్ ఈ టోర్నీలో 10 మ్యాచ్ ల్లో 77 సగటుతో 707 పరుగులు చేశాడు. వీటిలో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి ఆ తర్వాత వరుసగా క్రిస్ గేల్,విరాట్ కోహ్లీ,జాక్వెస్ కాలిస్ ఉన్నారు. గేల్ 52.73 సగటుతో 791 పరుగులు.. కోహ్లీ  88.17 సగటుతో 529 పరుగులు.. కలిస్ 46.64 సగటుతో 653 పరుగులు చేసి ఈ ఐసీసీ టోర్నీలో అద్భుతమైన రికార్డ్ కలిగి ఉన్నారు. 

వికెట్ కీపర్ గా ఆండీ ఫ్లవర్ ను ఆరో స్థానంలో ఎంపిక చేసింది. ఈ టోర్నీలో ఈ జింబాబ్వే ప్లేయర్ 66.75 సగటుతో 267 పరుగులు చేశాడు.   ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా షేన్ వాట్సన్ (453 పరుగులు,17 వికెట్లు).. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా(95 పరుగులు, 16 వికెట్లు) వరుసగా 7, 8 స్థానాలను సెలక్ట్ అయ్యారు. కైల్ మిల్స్, మెగ్రాత్ లను ఫాస్ట్ బౌలర్లుగా ఎంచుకుంది. మిల్స్ 15 మ్యాచ్ ల్లో 17.25 యావరేజ్ తో 28 వికెట్లు తీసుకుంటే మెగ్రాత్ 12 మ్యాచ్ ల్లో 19.61 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ముత్తయ్య మురళీధరన్ కు అవకాశం కల్పించారు. ఈ లంక స్పిన్నర్ ఈ టోర్నీలో 17 మ్యాచ్ ల్లో 20.17 సగటుతో 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.