పళ్ల తీపి చేసినా.. చిగురు వాపు వచ్చినా, వాచినా 'ఏం కాదులే' అని లైట్ తీసుకుంటారు చాలామంది. కానీ, శరీరంలో వచ్చే చాలా మార్పులు ముందుగా బయటపడేది నోట్లోనే! నోరు పొడిబారితే ఏమవుతుంది? జ్ఞానదంతం తీసేస్తే ఏం అవుతుంది. తినేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. . .
పది సంవత్సరాలు వయస్సు ఉన్నవారికివెనక దవడ పళ్లు వస్తున్నప్పుడు అక్కడ చిగురు వాస్తే... తినేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాల పళ్లు ఊడి, పర్మినెంట్ పళ్లు వచ్చేటప్పుడు చిగురు వాస్తుంది . కింద పన్ను బయటకు వస్తుందా? లేదా? అని తెలుసుకోవాలంటే ఎక్స్ రే తీసి నిర్ధారించుకోవాలి. అది చక్కగానే వస్తున్నట్లయితే.. ఈ చిగుర్ల మీద లిగ్నోక్లెయిన్ ఆయింట్ మెంట్ గానీ, బెంజోకెయిన్ ఆయింట్ మెంట్ గానీ తినేముందు పూస్తే.. నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాకాకుండా ఒకవేళ చిగురు గట్టిపడి. పన్ను బయటకు రాలేకపోతే దానికి ఒవర్ క్షక్' అనే ఒక చిన్న పద్ధతి ద్వారా క్లియర్ చేయొచ్చు. లోపల ఉన్న పన్ను తీరుని బట్టి చికిత్స చేయించుకోవాలి. పన్ను బయటకు వచ్చిన తర్వాత చిగురు మీద ఆహారం ఒత్తిడి పడదు. కాబట్టి. నొప్పి తగ్గిపోతుంది.
ఇక సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో జ్ఞాన దంతాలు బయటకు రావడం ప్రారంభమవుతాయి. ఇవిబయటకు వచ్చేటప్పుడు చిగురు లోపల ఇరుక్కున్నప్పుడు వంకరగా వస్తుంటాయి. ఒక్కోసారినగం మాత్రమే వచ్చి ఆగిపోతాయి. ఈ పళ్లను ఇంపాక్లైడ్ టీవ్ అంటారు. ఇలా వంకర తిరిగిన, ఇరుక్కున్న పళ్ల దగ్గర ఆహారం చేరినప్పుడు చిగురు వాస్తుంది. ఇదే దవడ దగ్గర నొప్పికి కారణమువుతుంది. మందులు తీసుకున్నప్పుడు ఈ నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ, అది తాత్కాలికమే అని గుర్తించాలి.
ఇలాంటప్పుడు చిగురుని తొలగించాల్సి వస్తుంది. పన్ను పొజిషన్ వంకరగా ఉండే ముందు పన్నుపై ఒత్తిడి పడినప్పుడు జ్ఞాన దంతాన్ని తొలగించాలి. తొలగించిన తర్వాత కృత్రిమ పళ్లు పెట్టించుకోవాల్సిన ఆవసరం కూడా లేదు. స్కాన్, ఎక్స్ రేలో జ్ఞాన దంతాల పొజిషన్ తెలుసుకుని.. డాక్టర్లు జ్ఞానదంతాల్ని తొలగిస్తారు లేదా పన్ను చక్కగా ఉంటే, చిగురిని తొలగించి దానికి ఒక దారిని క్రియేట్ చేస్తారు.
జ్ఞాన దంతం, చిగురు మధ్య ఆహారం ఇరుక్కుంటోంది. జ్ఞాన దంతం అనే కాదు.. పన్నుకు... చిగురుకి మధ్య ఎక్కడా ఆహారం నిల్వ ఉండకూడదు. జ్ఞాన దంతానికి, దాని ముందు పన్నుకు మధ్య ఆహారం ఉన్నప్పుడు జ్ఞానదంతంతోపాటు అది పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ పుచ్చు లోపలి నుంచి మొదలవుతుంది. కంటికి కనిపించదు. నొప్పి వచ్చినప్పుడు మాత్రమే సమస్య తెలుస్తుంది. నొప్పి రాగానే.. దంత వైద్యుడిని కలవాలి.
ఇంకా నోటిలో వచ్చే మరొక సమస్య ఏంటంటే.. ఇన్ఫెక్షన్స్ లేదా దురలవాట్ల వల్ల కండరాలు అన్నీ గట్టిగా బిగుసుకు పోతాయి. దీన్నే 'ఓరల్ రబ్ న్యూకోస్ ఫైబ్రోసిస్ అంటారు. ఈ సమస్యలు ఉన్నప్పుడు నోరు తెరిచేందుకు ఇబ్బంది పడుతుంటారు. కింది దవడ, ప్రై దవడ అతుక్కొని ఉన్న జంక్షన్ దగ్గర ఉండే జాయింట్ల వద్ద వచ్చిన మార్పుల వల్ల కూడా ఒక్కోసారి నోరు తెరవలేకపోతారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
ఒక్కోసారి నోరు పొడిబారినట్టు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు తినేటప్పుడు తేలికగా మింగలేకపోతారు. మాట్లాడేటప్పుడు నాలుక పొడిగా ఉండటం వల్ల. మాటలు కూడా స్పష్టంగా రావు. ఇలాంటి సమస్యలకు చాలా కారణాలు ఉన్నాయని దంత నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల, కొన్ని రకాల మందులు వాడటం, నోటితో గాలి పీల్చుకోవడం, కొన్ని రకాల సిండ్రోమ్స్ .. క్యాన్సర్ ట్రీట్ మెంట్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నోరు ఆరిపోయి పొడిబారుతుంది.
ఈ సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. చాలాజలం ఉత్పత్తితగ్గిపోయినప్పుడు తింటున్న ఆహారం పళ్ల చుట్టూ చేరి వెంటనే గట్టిపడటం పళ్లకి చిగురికి మధ్య చేరిపోతుంది. అది పళ్ల మధ్య చాలా కాలంఅతుక్కొని ఉంటుంది. దీనివల్ల చిగురు వ్యాధులురావడంతో పాటు పిప్పి పళ్లు కూడా తొందరగావస్తుంటాయి. నోరు పొడిబారడానికి కారణంతెలుసుకొని చికిత్స తీసుకోవాలి. అయితే,నోరు పొడిబారకుండా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.
- నీళ్ల బాటిల్ దగ్గరపెట్టుకుని కొంచెం కొంచెం తాగుతూ ఎప్పుడూ నోటిని తడుపుకుంటూ ఉండాలి
- షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ని సమలడం వల్ల కూడా లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది.
- స్మోకింగ్, ఆల్యహాల్కి దూరంగా ఉండటం వల్ల కూడా నోటి పొడిని తగ్గించుకోవచ్చు.
- 'అర్టిఫిషియల్ సలైవర్ సబ్ స్టిట్యూట్స్" అని మెడికల్ షాప్ లో దొరుకుతాయి. ఈ లిక్విడ్స్ నోట్లో పూసుకున్నప్పుడు నోరు తడిగా మారుతుంది.
అరిపోయినా పట్టించుకోకపోవడం వల్ల నోరు పగలడం, కారం తిన్నప్పుడు మండటం... మాటల్లో స్పష్టత లేకపోవడం, తినేటప్పుడుమింగలేకపోవడం వంటివి జరుగుతాయి.కొంతమంది నిద్రలో పళ్లు కొరకడం, పళ్ల అరుగుదల... తినేటప్పుడు పళ్లు వండర టింకరగా మ్యాచ్ కావడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. జాయింట్ల దగ్గర ఇన్ఫెక్షన్స్ జాయింట్లు అరిగిపోయి బోన్ చేంజెస్ రావడం వల్ల దవడని కదిలించలేక ఇబ్బంది పడతారు.