జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్‌ని చేయండి: మాజీ క్రికెటర్

ఛాంపియన్స్ ట్రోఫీకి కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా స్పందించారు. ప్రస్తుత బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేస్తున్న తీరు బాగోలేదని.. తనను సెలక్షన్ కమిటీ చైర్మన్ చేయాలని ఆయన కోరారు. అలా చేస్తే ఎవరి మనసు నొప్పించకుండా.. అందరికి న్యాయం చేస్తానని అన్నారు.

"కరుణ్ నాయర్ దురదృష్టవంతుడని అనుకుంటున్నా. నేను సెలెక్టర్ల ఛైర్మన్‌గా ఉండాలనుకుంటున్నాను. అతడు టెస్ట్ మ్యాచ్‌లో 300 పరుగులు చేశాడు.. ఆ తరువాత అదృశ్యమయ్యాడు. ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రుని రూపంలో మళ్లీ  వచ్చాడు. మరోసారి రాణిస్తున్నాడు.. ఇప్పుడైనా అతను చంద్రుడు 2 రూపంలో ప్రకాశించాలి. జట్టులో 35-36 ఏళ్ల వయస్సు గలవారు ఎంత మంది ఉన్నారు. ఇది వన్డే ఫార్మాట్. మైదానంలో చురుగ్గా కదలడం అవసరం.. ఆ దిశగా జట్టు ఎంపిక ఉండాలి"

Also Read : భారీ లక్ష్యాన్ని చేధించిన మిల్లర్ జట్టు

"కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బలహీనుడే. అతడు ఫీల్డింగ్‌ చేస్తే రెండు పరుగులు సులువుగా వస్తాయి. విరాట్ కోహ్లి ఎంతసేపు స్లిప్‌లో..  సర్కిల్ లోపల మాత్రమే ఫీల్డింగ్ చేస్తాడు. ఇలా జట్టులో ఒక్కొక్కరిది ఒక్కో తీరు.."అని సురీందర్ ఖన్నా అన్నారు. 

7 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు

దేశవాళీ క్రికెట్ లో కుర్రాళ్లు రాణించడం మూమూలే. కానీ 33 ఏళ్ల కరుణ్ నాయర్‌ ఆట మాత్రం భిన్నంగా ఉంది. 112, 44*, 163*, 111*, 112, 122*, 88*.. ఇవీ గత ఏడు ఇన్నింగ్స్‌లలో అతడు చేసిన స్కోర్లివి. 7 ఇన్నింగ్స్‌లలో 752 పరుగులు.. బ్యాటింగ్‌ యావరేజ్‌ 752. నమ్మశక్యం కాని గణాంకాలు ఇవి. ఇంతలా రాణిస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 

2016లో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ భారత జట్టు తరఫున 6 టెస్టులు మాత్రమే ఆడాడు. అనూహ్యంగా ట్రిపుల్ సెంచరీ(303*) చేశాక కనుమరుగయ్యాడు. ఈ బ్యాటర్ భారత జట్టు తరపున రెండు వన్డేలు కూడా ఆడాడు. అత్యుత్తమ స్కోరు 39.