స్కూల్లో క్షుద్రపూజలు..స్టూడెంట్స్ పరుగులు

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేగింది. స్కూల్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడంతో విద్యార్థులు, టీచర్లు భయాందోళన చెందుతున్నారు. అయితే పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలే క్షుద్ర పూజలు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు టీచర్లు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు స్కూల్లో క్షుద్రపూజలు చేయించదని చెబుతున్నారు. విద్యార్థులు స్కూల్ కి రావాలంటే భయపడుతున్నారని.. హెచ్ఎమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.