ఆడవాళ్లు మెచ్చే సినిమా

ఆడవాళ్లు మెచ్చే సినిమా

శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిశోర్ రూపొందించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న ఫ్యామిలీ సినిమా ఇది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మన కుటుంబ సభ్యుల్లా కనిపిస్తాయి. ఇన్సిడెంట్స్ మన ఇంట్లో జరిగినట్టే  అనిపిస్తాయి’ అని చెప్పింది.  కిశోర్ మాట్లాడుతూ ‘ప్యాండమిక్ తర్వాత యాక్షన్, మాస్, యూత్, లవ్ స్టోరీలు  వచ్చాయి. అయితే పిల్లలతో కలిసి చూసే సినిమాను మిస్సయ్యాం. ఆ వాతావరణాన్ని మా సినిమా వంద శాతం ఇస్తుందని నమ్ముతున్నా. థియేటర్లు ఫ్యామిలీలతో కళకళలాడాలని కోరుకుంటున్నా. ఆడవాళ్లందరికీ ఈ సినిమా కచ్చితంగా కనెక్టవుతుంది’ అన్నారు.  అందరూ ఎంజాయ్ చేసే సినిమా అన్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. యాంకర్, నటి ఝాన్సీ.. సినిమాటోగ్రాఫర్ సుజిత్ కూడా పాల్గొన్నారు