BSNLకు యమక్రేజ్..6నెలల్లో 55లక్షల కొత్త కస్టమర్లు

BSNLకు యమక్రేజ్..6నెలల్లో 55లక్షల కొత్త కస్టమర్లు

ప్రభుత్వ టెలికం సంస్థ BSNLకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. టెలికం రంగంలోకి గట్టి పోటీదారుగా తిరిగి అడుగుపెడుతోంది. గడిచిన 6నెలల్లో 55లక్షల కొత్త కస్టమర్లను సంపాదించింది. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లునుంచి పోటీ, రీచార్జుల ధరల పెరుగుదల క్రమంలో ఇంది BSNL కు ముందడుగుగా చెప్పొచ్చు. 2024జూన్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు BSNL కస్టమర్ల సంఖ్య  8.55 కోట్లనుంచి 9.1 కోట్లకు పెరిగింది. 

BSNL తన నెట్ వర్క్ ను అప్ గ్రేడ్ చేసేందుకు వేగంగా పనిచేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 80వేల 4G టవర్లను ఇన్ స్టాల్ చేసింది. ఈ టవర్లను 2025 జూన్ నాటికి లక్షకు పెంచాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 4G టవర్లు ఏర్పాటుతో 5G సేవలను అప్ గ్రేడ్ చేయడం చాలా ఈజీ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ 4G సేవల విస్తరణ కంప్లీట్ అయితే స్వదేశీ 5G నెట్ వర్క్ ను ఇండియా మొత్తం వేగంగా కనెక్టివిటీని అందించవచ్చని తెలిపింది. 

Also Read : దేశ ప్రజలపై కేంద్రం బాదుడు

ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ BSNL దూసుకుపోతోంది. ఇటీవల 4G సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న BSNL ..-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ను పునరుద్దరించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) నుంచి  రూ.61వేల కోట్లకు 5G స్పెక్ట్రమ్‌ను పొందింది. ఈ కేటాయింపు BSNL తన 5G సేవలను అందించడం ద్వారా టెలికాం రంగంలో తిరిగి పుంజుకుని ప్రత్యర్థి టెలికం ఆపరేటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.