లాంగ్‌‌‌‌టెర్మ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌తో ..రూ. కోట్లు సంపాదించిన పెద్దాయన

లాంగ్‌‌‌‌టెర్మ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌తో ..రూ. కోట్లు సంపాదించిన పెద్దాయన
  • ఏడాదికి రూ. 6 లక్షల డివిడెండ్‌‌‌‌ వస్తోందని వెల్లడి

న్యూఢిల్లీ: ఓ పెద్దాయన తన సింప్లిసిటీతో  సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. సాధారణ జీవితం గడిపే వాళ్లు చాలా మంది ఉంటారుగా  అంత స్పెషాలిటీ ఏముందని అనుకోవచ్చు. కానీ, ఆయన దగ్గర రూ.10 కోట్ల విలువైన ఎల్ అండ్‌‌‌‌ టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఉండడమే కారణం. మరో రూ. కోటి విలువైన కర్నాటక బ్యాంక్ షేర్లు, రూ. 10 లక్షల విలువైన కోటక్ బ్యాంక్ షేర్లు  కూడా ఉన్నాయి.  

డివిడెండ్‌‌‌‌ కింద ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తున్నానని ఆయన ఓ వీడియోలో పేర్కొన్నారు. మంచి కంపెనీల షేర్లను హోల్డ్ చేయడం వలన సంపద వేగంగా పెంచుకోవచ్చనే విషయం ఈ పెద్దాయన నను చూస్తే అర్థమవుతుంది. రాజీవ్ మెహతా అనే ట్విట్టర్ యూజర్   విలేజ్‌‌‌‌లో నివసిస్తున్న ఓ పెద్దాయన వీడియోని పోస్ట్ చేశారు.  ఈ వీడియోలో తన నేటివ్ భాషలో పెద్దాయన మాట్లాడారు. తన దగ్గర ఉన్న షేర్లను గురించి వివరించారు. 

‘రూ.80 కోట్ల విలువైన ఎల్ అండ్ టీ షేర్లను, రూ.21 కోట్ల విలువైన అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లను, రూ. ఒక కోటి విలువైన కర్నాటక బ్యాంక్ షేర్లను ఈ పెద్దాయన హోల్డ్‌‌‌‌ చేస్తున్నారు. అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు’ అని రాజీవ్‌‌‌‌ మెహతా ట్వీట్‌‌‌‌ చేశారు. కానీ, ఈ ఇన్‌‌‌‌ఫర్మేషన్ తప్పు అని, ఆయన దగ్గర రూ.100 కోట్ల విలువైన షేర్లు లేవని రూ. 10 కోట్ల షేర్లే ఉన్నాయని యూజర్లు కామెంట్ చేశారు.

అయినప్పటికీ ఈ అమౌంట్ కూడా చాలా ఎక్కువని ఆశ్చర్యపోతున్నారు.  లెక్కపెడితే  పెద్దాయన దగ్గర రూ.8.05 కోట్ల విలువైన  ఎల్ అండ్ టీ షేర్లు, రూ.2.04 కోట్ల విలువైన అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఉన్నాయి. 

ఈ వీడియో పోస్ట్‌‌‌‌ అయిన కొన్ని రోజుల్లోనే పది లక్షల వ్యూస్ రావడం విశేషం. చాలా మంది  లాంగ్‌‌‌‌టెర్మ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ గురించి మాట్లాడుకుంటున్నారు.  మంచి కంపెనీల షేర్లను హోల్డ్‌‌‌‌ చేయడం బెటర్‌‌‌‌‌‌‌‌ అని  చెబుతున్నారు.