బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. 15 ఏళ్లు ప్రధాని.. బంగ్లాదేశ్ దేశ ఏర్పాటులో భాగస్వామ్యం.. అంత లెగసీ ఉంది ఆమెకు.. అతి పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు.. అలాంటి షేక్ హసీనా తన 76 ఏళ్ల చరిత్రను.. జస్ట్ కేవలం 45 నిమిషాల్లో ముగిసిపోయింది.
ఏ దేశం కోసం అయితే పోరాటం చేసిందో.. ఏ దేశ ప్రజల కోసం అయితే తన కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందో.. ఆ దేశ ప్రజలు తిరగబడటంతో.. ఆ దేశం నుంచే పారిపోయింది.. ఇదంతా జరిగింది కేవలం 45 నిమిషాల్లోనే.. నరాలు తెగే ఉత్కంఠ.. హాలీవుడ్ సినిమా క్లయిమాక్స్ను తలదన్నేలా సాగిన షేక్ హసీనా చివరి 45 నిమిషాలపై వీ6 వెలుగు ఎక్స్ క్లూజివ్ కథనం..
2024, ఆగస్ట్ 5వ తేదీ ఉదయం 9 గంటలకు.. రిజర్వేషన్ల వ్యతిక ఉద్యమంలో భాగంగా.. కర్ఫ్యూను లెక్కచేయకుండా లక్షల మంది యువత రాజధాని ఢాకా వీధుల్లో కవాతు చేస్తున్నారు. ఈ పరిస్థితిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ప్రధాని షేక్ హసీనా. దేశంలో విధ్వంసం ఏ క్షణమైనా జరగొచ్చు.. మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని ఆర్మీ, నేవీ, రక్షణ, పోలీస్ ఉన్నతాధికారులు మీటింగ్ లో స్పష్టం చేశారు.
అయినా రాజీనామా చేయటానికి వెనక్కి తగ్గలేదు హసీనా.. మరింత బల ప్రయోగంతో ఉద్యమాన్ని కట్టడి చేయాలని ఆదేశించారు. దీనికి పోలీస్, ఆర్మీ ససేమిరా అన్నారు.. దీనిపై షేక్ హసీనా ఆగ్రహం.. మిమ్మల్ని నమ్మాను.. మీకు అధికారాలు ఇచ్చాను.. అయినా ఇంత దూరం తీసుకొచ్చారని ఆగ్రహం.. నెల రోజుల నిర్భంధం ఇప్పుడు కట్టలు తెగించి.. ఇంతకు మించి ముందకు వెళితే మరింత ప్రమాదం అని ఆర్మీ, పోలీస్ చీఫ్ లు కూల్ చేశారు.
- ఉదయం 10.30 గంటలకు.. ఆర్మీ, పోలీస్ ఉన్నతాధికారులు రాజీనామా చేయమని తేల్చి చెప్పారు. షేక్ హసీనా ఒప్పుకోలేదు.. ఆ వెంటనే ఆమె సోదరి రెహానాతో 10 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడిన ఆర్మీ ఉన్నతాధికారులు.. సోదరి ద్వారా హసీనాకు నచ్చచెప్పారు. అయినా ససేమిరా అన్నారు.
- ఇదే సమయంలో హసీనా కుమారుడు, కుమార్తెతో ఫోన్ లో మాట్లాడారు ఉన్నతాధికారులు. పరిస్థితిని వివరించారు. అప్పటికే సమయం 10.45 నిమిషాలు.. ఆ వెంటనే కొడుకు, కుమార్తె ప్రధాని షేక్ హసీనాతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు.. రాజీనామా చేయాలని ఒప్పించారు.
- ఉదయం 10.55 నిమిషాలు.. ప్రధాని నివాసంలోనే ఉన్న ఆర్మీ, పోలీస్ చీఫ్ లకు ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్. మరో 30 నిమిషాలు అంటే.. 11.30 గంటల సమయానికి లక్షల మందితో సాగుతున్న యువత కవాతు ప్రధాని ఇంటికి చేరుకుంటుంది.. వాళ్లను ఆపటం కష్టం.. ఏమైనా జరగొచ్చని హెచ్చరికలు.
- ఈ సమయంలో అత్యంత వేగంగా ఆర్మీ, పోలీస్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. షేక్ హసీనాతోపాటు సోదరిని హెచ్చరించారు. 10 నిమిషాల్లో తీసుకోవాల్సిన వస్తువులు అన్నీ తీసుకోవాలని సమాచారం ఇచ్చారు. దీని కోసం అధికారులు సాయం కూడా చేశారు.
- అప్పటికే సమయం 11.10 నిమిషాలు.. ప్రధాని ఇంటి వెనక నుంచి అధ్యక్షుడి నివాసానికి వెళ్లిన షేక్ హసీనా.. తన రాజీనామా లేఖ సమర్పణ..
- అక్కడి నుంచి నేరుగా ప్రధాని ఇంటి వెనక ఉన్న ప్రత్యేక హెలిప్యాడ్ కు 11.15 నిమిషాలకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ హెలికాప్టర్ లో తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి లిఫ్ట్ అయ్యారు..
- జస్ట్.. కేవలం 45 అంటే 45 నిమిషాల్లోనే షేక్ హసీనా 76 ఏళ్ల బంగ్లాదేశ్ అనుబంధం ముగిసింది.. చరిత్ర అయ్యింది.. కొత్త అధ్యాయానికి నాంది పలికింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం.. ఇప్పుడు అదే దేశం నుంచి పారిపోయి.. మరో దేశంలో తలదాచుకుంటుంది. షేక్ హసీనా జీవితంలోని చివరి 45 నిమిషాల ఉత్కంఠ మాటల్లో చెప్పలేం అని.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిందని బంగ్లాదేశ్ పత్రికలు వెల్లడించాయి.