న్యూఢిల్లీ: ఒకప్పుడు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండేది. కానీ 3జీ ఆ తర్వాత 4జీ రావడంతో ఇంటర్నెట్ సేవలు స్పీడ్ అయిపోయాయి. మున్ముందు 5జీ సర్వీసెస్ కూడా అందుబాటులో రానున్నాయి. ఈ విషయాలను పక్కనబెడితే ఇంటర్నెట్ స్పీడ్‌లో కొత్త రికార్డు నమోదైంది. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజీ రీసెర్చర్స్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ రికార్డును సెట్ చేశారు. సెకన్‌కు 178 టెరాబైట్స్ (టీబీపీఎస్) ఇంటర్నెట్ స్పీడ్‌ను అందుకున్నారు. మరో లెక్కన చూసుకుంటే ఇది 178,000 జీబీపీఎస్‌గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియాలో ఉన్న మినిమమ్ ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్.
ఈ ప్రాజెక్టుకు రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన డాక్టర్ లిడియా గల్డినో సారథ్యం వహించారు. ఇంతకు ముందున్న ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ 44.2 టీబీపీఎస్. ఇది ఆస్ట్రేలియాలో నమోదైంది. తాజా రికార్డు దీనికి నాలుగు రెట్టు వేగవంతం కావడం విశేషం. 178 టీబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా, వెట్ సిరీస్ దేన్నయినా ఒక్క సెకన్‌లో డౌన్‌లోడ్ చేసేయొచ్చు. ఈ ప్రయోగంలో సిగ్నల్ బూస్టింగ్ కోసం స్టాండర్డ్ ఆప్టిక్ ఫైబర్ ఆప్టిక్స్‌కు బదులు రీసెర్చర్స్ కొత్త యాంప్లిఫైడ్ టెక్నాలజీని వినియోగించారు. అలాగే 4.5టీహెట్జ్ స్థానంలో 16.8టీహెట్జ్‌ను యూజ్ చేశారు.