వ్యవసాయ బిల్లుతో దశాబ్దాల పాపాలు పోతాయి

ఢిల్లీ: ఈ వ్యవసాయ బిల్లు వల్ల దశాబ్దాల  పాపాలు పోతాయి… రైతుల పరంగా చూస్తే నిజంగా వరం లాంటిది..రైతే రాజు అవుతాడు అని బీజేపీ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. అందుకే బిల్లుని చూసి కేసీఆర్ ఉల్లిక్కిపడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఒక పక్క ఇప్పటికి రైతులు మద్దతు ధర కోసం రోడ్లు ఎక్కుతున్నారు..  60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకి అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ బిల్లు తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది.. గాంధీ కుటుంబ అసబద్దమైన రాజకీయాల వల్ల ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసు.. ఈ బిల్లు వల్ల రైతు పంట ఎక్కడ ఎప్పుడు అమ్ముకోవాలో రైతు నిర్ణయించుకోవచ్చు.. బిల్లు వల్ల రైతులకు చాలా బెనిఫిట్.. ఈ బిల్లు వల్ల రైతు అమ్మిన వస్తువుకి అదే రోజు డబ్బులు ఇవ్వాలి.. రైతు దేశంలో ఏ రాష్ట్రంలో అయిన పంట అమ్ముకోవచ్చు.. రాష్ట్రాలు కూడా రైతులపై టాక్స్ వేయడానికి వీలు లేదని ఆయన వివరించారు.

మోడీకి, కేసీఆర్ కి చాలా వ్యత్యాసం ఉంది…. కేశవరావు మస్క కొట్టుకుంటూ టిఆర్ఎస్ లో ఉన్నాడు… 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందుకు ఇలా దిగజరిపోతున్నారు.. కేటీఆర్ మార్కెట్ యార్డులతో కుమ్మక్కవుతున్నాడు.. మార్కెట్ యార్డులో చాలా అవినీతి ఉంది… తమ వాటా తగ్గుతుందని కేసీఆర్ భయపడుతున్నాడు.. తెలంగాణలో కల్వకుంట్ల టాక్స్ ఉందని ప్రజలకు తెలియాలని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.  రాష్ట్రంలో పనికిమాలిన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ… ఇది  ఫ్రెండ్లీ ప్రతిపక్షం అని ఎంపీ అరవింద్ విమర్శించారు.

టీఆర్ఎస్ దళారీలే వ్యతిరేకిస్తున్నారు-ఎంపీ సోయం బాపురావు

వ్యవసాయ బిల్లును ప్రాంతీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయో తెలియడం లేదు.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు లబ్ది చేకూరుతుందని మరో బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఈ బిల్లుతో దళారీ వ్యవస్థ పూర్తిగా పోతుంది… రైతు ఎలాంటి నష్టం లేకుండా పంటను అమ్ముకోవచ్చన్నారు. తెలంగాణలో ఈ దళారిల వ్యవస్థ ఎక్కువగా ఉంది.. ఈ దళారీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులేనని ఆయన విమర్శించారు.