పుట్టుకతోనే గుండె భాగంలో అవయవాలు ఉదర భాగంలో.. కృత్రిమ డయాఫ్రమ్తో.. పసిబిడ్డకు ప్రాణం పోశారు

పుట్టుకతోనే గుండె భాగంలో అవయవాలు ఉదర భాగంలో.. కృత్రిమ డయాఫ్రమ్తో.. పసిబిడ్డకు ప్రాణం పోశారు
  • కృత్రిమ డయాఫ్రమ్తో.. పసిబిడ్డకు ప్రాణం పోశారు

హైదరాబాద్/ జూబ్లీహిల్స్, వెలుగు: ఓ శిశువుకు పుట్టుకతోనే శరీరంలోని ఉదర భాగంలో ఉండాల్సిన కొన్ని అవయవాలు గుండె భాగంలోకి వెళ్లిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంజారాహిల్స్​లోని లిటిల్ స్టార్ అండ్ షీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్​ డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. మళ్లీ అలాంటి సమస్య ఏర్పడకుండా ఆర్టిఫీషియల్​డయాఫ్రం ఏర్పాటు చేసి ప్రాణాలు నిలిపారు. హాస్పిటల్​లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోనటాలజిస్ట్ డాక్టర్​సతీశ్ ఈ చికిత్స వివరాలను వెల్లడించారు. సౌదీ అరేబియాకు చెందిన సయ్యద్ ​హైదర్​హుస్సేన్ దంపతులు డెలివ‌‌రీ కోసం ఇండియాకు వచ్చి ఆస్పత్రిలో చేరారు.

కడుపులో ఉన్న శిశువుకు డయాఫ్రం సమస్య ఉన్నట్టు గుర్తించి, డెలివరీ తర్వాత సర్జరీ చేయాలని నిర్ణయించారు. శిశువు వ‌‌య‌‌సు దృష్ట్యా అత్యంత సంక్లిష్టమైన ఈ సర్జరీని ఓపెన్​ పద్ధతిలో కాకుండా కీహోల్ (థొరాకోస్కోపీ)లో చేశారు. డిసెంబరు 20న బాబు పుట్టగా, 23 నుంచి మూడు రోజులుగా శిశువుకు కీహోల్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. డయాఫ్రం సమస్యతో శిశువు గుండె భాగంలోకి వెళ్లిన లివర్, కిడ్నీ, పేగులను యథాస్థితికి తీసుకొచ్చాం. బాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, మరో 5 రోజుల్లో డిశ్చార్జి​చేస్తామన్నారు.