ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టి విజయం సాధించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగా ల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరారు వివేక్ వెంకటస్వామి. సానుకూలంగా స్పందించిన సీఎం..హామీని నెరవేరుస్తామని తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్ వెంకటస్వామి ఎన్నికల హామీ భాగంగా సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే హామీని తప్పక నెరవేరుస్తామన్న వివేక్ వెంకటస్వామి.. అనుకున్నట్లుగాను సింగరేణిలో స్థానికులకే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రిక్వె్స్ట్ చేశారు.. స్పందించిన సీఎం హామీ నెరవేరుస్తామని తెలిపారు.