ఫేక్ పే స్లిప్​లతో రూ. 20 కోట్ల పర్సనల్ లోన్

గచ్చిబౌలి, వెలుగు: తప్పుడు పే స్లిప్​లు సృష్టించి పలువురు వ్యక్తుల పేరు మీద బ్యాంకు నుంచి రూ. 20 కోట్ల మేర పర్సనల్ లోన్​ తీసుకొని చీటింగ్​ చేసిన ఇద్దరు ప్రధాన నిందితులతో పాటు మరో 8 మంది నిందితుల గ్యాంగ్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.  ఈ గ్యాంగ్​ 72 మంది అమాయక జనాలపై  రూ.20 కోట్ల వరకు బ్యాంక్​ లోన్​ తీసుకున్నట్లు సైబర్​ క్రైమ్​ పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్​బీకాలనీ లోధాలో ఉండే పాలురి దీపక్​రెడ్డి(35) ఎడ్యుకేషన్​ కన్సల్టెన్సీ బిజినేస్​ రన్​ చేస్తున్నాడు. ఇతను జీఎస్​ఆర్​​ ఎడ్వైజర్​ ప్రై. లిమిటెడ్​ అనే కంపెనీకి ఎండీగా పనిచేస్తున్నాడు. మోతినగర్​కు చెందిన రాజ్​కుమార్​(33) రియల్​ ఎస్టేట్​ బిజినెస్ చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి గ్యాంగ్​గా ఏర్పడ్డారు. దీపక్​​రెడ్డి తన వద్ద పనిచేస్తున్న 31 మందిని క్యాప్​స్టన్​ సర్వీస్​ లిమిటెడ్​ కంపెనీలో పనిచేసేందుకు ఒప్పదం చేసుకున్నాడు. 31 మంది క్యాప్​స్టన్​లో ఒక నెల జాబ్ చేసేందుకు వారి ఆధార్​, పాన్​ కార్డు, బ్యాంక్​ వివరాలను, జాబ్​ రోల్​ను క్యాప్ ​స్టన్​కు అందించాడు. వీరంందరూ జీఎస్​ఆర్​ కంపెనీ నుండి క్యాప్​స్టన్​లో జాబ్ చేస్తున్నారు. అయితే నెల రోజుల తర్వాత 31 మంది హాజరును క్యాప్​స్టన్​కు అందించకపోవడంతో వీరి ఉద్యోగాలను రద్దు చేసింది.  

అయితే జీతాలు పడే బ్యాంక్​ ఖాతాలు ఉన్న బ్యాంకులకు ఈ వివరాలను  క్యాప్​స్టన్​ చెప్పలేదు. ఈ 31 మందికి నెల రోజులకు సంబంధించిన జీతాలను క్యాప్​స్టన్​  కంపెనీ పేరు మీద పే స్లిప్​లు సదరు వ్యక్తులకు అందజేసింది. నెల ప్రాజెక్టు కోసం నియమించుకోవడంతో క్యాప్​స్టన్​ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే విధంగా రాజ్​కుమార్​ స్కాట్​లైన్​ కంపెనీ సీఈవో అయిన స్వరూప్​కు ఫ్యామిలీ ఫ్రెండ్​. స్వరూప్​కు స్కిల్​మేజ్​ సీఈవో, బోద్​ ట్రీ సీఈవోలతో పరిచయముంది. స్కాట్​లైన్​ కంపెనీ, బోద్​ట్రీ కంపెనీల మధ్య కాంట్రాక్ట్​ పద్దతిన కార్మికులను నియమించుకునే ఒప్పందం ఉంది. ఈ క్రమంలో రాజ్​కుమార్​ 28 మందిని స్వరూప్​కు రిఫర్​ చేశాడు. వారి ఆధార్​, పాన్​ కార్డులు, బ్యాంకు వివరాలను స్వరూప్​కు అందజేశాడు. 23 మంది స్కిల్​ మేజ్​(యూఎస్​ కంపెనీలో), ఐదుగురు బోద్​ట్రీ కంపెనీలలో పనిచేస్తున్నట్లు పే స్లిప్​లు రూపొందించమని స్కాట్​లైన్​ హైదరాబాద్​ బ్రాంచ్​ను స్వరూప్​ ఆదేశించాడు. దీంతో బోద్​ట్రీ 5 మంది పే స్లిప్​లు,  స్కాట్​లైన్​ కంపెనీ 23 మంది పే స్లిప్​లు ప్రిపేర్​ చేసింది. దీపక్ ​రెడ్డి, రాజ్​కుమార్​ ఇద్దరు రాకేశ్ ​రెడ్డి, దినేశ్ ​రెడ్డి, సాయి రవి వర్మ, ఈ. సురేష్​, డి. సురేష్, చిట్టిబాబు, హరీష్ ​చంద్రగోపాల్​, ఆదినారాయణ, వెంకటేశ్​తో​ కలిసి హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఆన్​లైన్​ ఫ్లాట్​ఫాం ద్వారా పర్సనల్​ లోన్లకు అప్లై చేశారు.  ఈ కేవైసీ ద్వారా సంబంధిత పత్రాలను అప్లోడ్​ చేశారు. బ్యాంక్​ బ్యాలెన్స్​, జీతం క్రెడిట్​ను చూపెట్టేందుకు కంపెనీ నుంచి తీసుకున్న బ్యాంక్​ స్టేట్​మెంట్​లు, పే స్లిప్​లు కూడా అప్​లోడ్​ చేశారు. లోన్​కు అప్లై చేసుకున్న వారందరూ బోద్​ట్రీ కన్సల్టింగ్​, క్యాప్​స్టన్​ సర్వీసెస్​, అడెక్కో ఇండియా లిమిటెడ్​ కంపెనీల్లో జాబ్ చేస్తున్నట్లు అప్లికేషన్​లో చూపెట్టారు. 

ఒక్కోక్కరిపై 50 లక్షల పర్సనల్​ లోన్​ తీసుకుండ్రు..

దీపక్​ ​రెడ్డి, రాజ్​కుమార్​ మరో 8 మందితో కలిసి బ్యాంకు అధికారులను మేనేజ్​ చేసి ఒక్కో వ్యక్తి పేరు మీద రూ.50 లక్షల వరకు పర్సనల్​ లోన్​ తీసుకున్నారు. బ్యాంక్​ నుంచి కన్ఫర్మేషన్​ కాల్​ మాట్లాడేందుకు అప్లయ్​ చేసిన వారి ఫోన్లను తమ వద్దే పెట్టుకున్నారు. ఒక్కో వ్యక్తిపై రూ. 40 లక్షల నుండి 50 లక్షల వరకు పర్సనల్​ లోన్లు వచ్చిన తర్వాత బాధితులకు 2 నుండి 3 లక్షలు ఇచ్చారు.

ALSOREAD:కొందరు నేతల చేరికలపై భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నయ్..కాంగ్రెస్ నేత మల్లు రవి

దొరికిండ్రు ఇలా...

లోన్​ తీసుకున్న తర్వాత తిరిగి నెల నెల బ్యాంక్​కు తిరిగి చెల్లించడంలో లోన్​ తీసుకున్న వారు విఫలం కావడంతో బ్యాంకు అధికారులు వెరిఫికేషన్​ మొదలుపెట్టారు. పర్సనల్​ లోన్​ అప్లై చేసే టైంలో అప్లికెంట్లు ఇచ్చిన అడ్రస్​లో ఎవరు లేరు. దీంతో బ్యాంక్​ అధికారులు మొత్తం రూ. 4 కోట్ల 38 లక్షల 17 వేల వరకు పర్సనల్​ లోన్లు తీసుకొని చీటింగ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు కంప్లయింట్​ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 10 మంది గ్యాంగ్​ సభ్యుల ముఠాను అరెస్ట్​ చేశారు.  ఈ గ్యాంగ్​ ఇప్పటి వరకు 72 మంది పేరు మీద 20 కోట్ల వరకు పర్సనల్​ లోన్​ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు బ్యాంక్​ అధికారులను మ్యానేజ్​ చేసి ఫ్రాడ్​ చేసినట్లు గుర్తించారు.  ఈ గ్యాంగ్​కు సపోర్ట్​ చేసిన  వీరిలో  హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పర్సనల్ లోన్​ అధికారులు చిట్టిబాబు, డి. సురేష్​, హరీష్​ చంద్ర గోపాల్​లు ఉన్నారు. వీరందరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు సైబర్​ క్రైమ్​ పోలీసులు తెలిపారు.