మల్టీ నేషనల్ కంపెనీల్లో జీతాలు తగ్గుతున్నయ్..శాలరీలు పెద్దగా పెంచట్లేరని చెబుతున్న సర్వేలు

  • ఎంఎన్‌‌సీల్లో తగ్గిన జీతాల పెంపు

న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీ ఇంకా ఇబ్బందుల్లో ఉండడంతో ఇండియాలోని చాలా ఎంఎన్‌‌సీ కంపెనీలు  శాలరీలను పెంచడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది కూడా ఎంఎన్‌‌సీలు ఇచ్చే శాలరీ హైక్స్ పెద్దగా పెరగకపోవచ్చని డెలాయిట్ సర్వే పేర్కొంది. 

గతంలో 9 శాతం మేర జీతాల పెంపు ఉండేది. ఈ ఏడాది సగటున 8.8 శాతం హైక్ ఉండొచ్చని సర్వే వెల్లడించింది. జీతాలు ఎక్కువగా పెంచే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు  కూడా గతంతో పోలిస్తే ఈ ఏడాది తక్కువగా శాలరీ పెంచుతాయని వివరించింది.  శాలరీ హైక్ 9.1 శాతం ఉండొచ్చని తెలిపింది. హెచ్‌‌సీఎల్ టెక్  తాజాగా  జూనియర్ ఉద్యోగుల జీతాలను 1–2 శాతం పెంచింది.