![Bhola Shankar: GPS ట్రాకింగ్ తో.. భోళా శంకర్ భారీ ర్యాలీ..](https://static.v6velugu.com/uploads/2023/08/Bhola-Shankar's-huge-rally_mEkedPs7xr.jpg)
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రేపు (ఆగస్టు11న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగా ఫ్యాన్స్ లో జోష్ పెరిగిపోయింది. రీసెంట్ గా చిరంజీవి ఫ్యాన్స్ 26 అడుగుల భారీ కటౌట్ తో అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసేందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. చిరు ఫ్యాన్స్ డిఫరెంట్ స్టైల్ లో మెగా అభిమానాన్ని చాటుకున్నారు. ఇవాళ (ఆగస్టు 10) హైదరాబాద్ వీధుల్లో జీపీఎస్(GPS) ట్రాకింగ్ తో భారీ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ర్యాలీ లో జీపీఎస్ ట్రాకింగ్ ఎటు చూసిన చిరంజీవి ముఖ చిత్రం అగుపడేలా ఈ ర్యాలీ కొనసాగించడం హైలెట్ గా నిలిచింది.
ఇవాళ (గురువారం) ఉదయం స్టార్ట్ అయినా ఈ ర్యాలీ..చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. . కాగా టాలీవుడ్ హిస్టరీ లో ఏ హీరోకు ఇటువంటి యాత్ర జరగలేదని..నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైన్మెంట్స్ తెలిపింది. అంతే కాకుండా..చిరంజీవి ఇండస్ట్రీలో మెగాస్టార్ గానే కాకుండా..సొసైటీ కు సర్వీస్ చేయడంలో..ఎంతో హ్యూమానిటీ కలిగి ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఒకరు. అందుకే చిరుపై ఉన్న గౌరవంతో ఇటువంటి ఈవెంట్స్ జరుపుటకు ఎప్పుడు రెడీ అంటూ ఏకే ఎంటెర్టైన్మెంట్స్ పేర్కొంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో నటించిన నటీనటులు, ఆయన చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియోలు పంపాలని భోళా శంకర్ మేకర్స్ కోరారు.
తమిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ చిత్రం అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ తో రాబోతుంది. ఈ సినిమాలో తమన్నా (tamanna bhatia) హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలు పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(keerti suresh) కనిపించనుంది. టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. ఏకె ఎంటెర్టైన్మెంట్స్ (AK Entertinements) బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర(Rama brahmam sunkara) నిర్మిస్తుండగా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.