జయశంకర్ భూపాలపల్లి: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలను గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్నవర్షాల కారణంగా వరదలు పోటెత్తు తున్నాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొన్నిచోట్లు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీ వర్షాలకు కారణంగా భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. జయశంకర్ భూపాలప్లి, ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఈ జిల్లాలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద సరుకులతో వెళ్తున్న వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. డ్రైవర్ ను స్థానికులు రక్షించారు. జిల్లాలో కేశవాపురం వద్ద పెద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేటలో కుంభవృష్టి వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది.