నిజామాబాద్లో స్పీడందుకున్న నామినేషన్లు

నిజామాబాద్లో స్పీడందుకున్న నామినేషన్లు
  •     కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్​
  •     ఈరోజటితో ముగియనున్న గడువు

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఒక్క రోజే గడువు మిగలడంతో గురువారం జిల్లాలో జోరుగా నామినేషన్లు సాగాయి. వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి 33 మంది నామినేషన్లు వేశారు. కొందరు డప్పు వాయిద్యాలతో ర్యాలీలు నిర్వహించి హంగామా చేయగా మరికొందరు సెంటిమెంట్​గా ఆలయాల్లో పూజలు చేసి నామినేషన్లు వేశారు. బోధన్​లో ఎంపీ అర్వింద్​ వెంటరాగా బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్​రెడ్డి నామినేషన్​ వేశారు.

కాంగ్రెస్​ అభ్యర్థి పి.సుదర్శన్​రెడ్డి నవీపేట మండలంలోని తన స్వగ్రామం సిరన్​పల్లి హనుమాన్​ మందిరంలో నామినేషన్​ పేపర్లకు పూజలు చేయించారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి బీఆర్ఎస్​ అభ్యర్థి షకీల్​ ఆమెర్​ నామినేషన్​ దాఖలు చేశారు. బోధన్​లో మోసిన్​(ఎంసీపీఐ), డి.నాగరాజ్​(ఫార్వర్డ్​ బ్లాక్), షేక్​జలీల్,​ సాయం మురళీ (ఇండిపెండెంట్) నామినేషన్​ వేశారు.  అర్బన్​లో షబ్బీర్​అలీ(కాంగ్రెస్), గణేశ్​గుప్తా (బీఆర్ఎస్), మహేశ్​బిగాల (బీఆర్ఎస్), ధన్​పాల్​ సూర్యనారాయణ (బీజేపీ), బి.లలిత, పడకంటి రాము,శివకుమార్​(ఇండిపెండెంట్లు), దత్తురాం కతల్​(రాష్ట్రీయ సమాజ్ పక్ష్), దండి లత (బీఎల్ఎఫ్​), ఫజల్​కరీం (ఎన్సీపీ), మన్సూర్​అలీ (అన్నా వైఎస్ఆర్ ​కాంగ్రెస్​) నామినేషన్లు వేశారు.

రూరల్​లో బాజిరెడ్డి గోవర్ధన్​(బీఆర్ఎస్), ఆర్.భూపతిరెడ్డి (కాంగ్రెస్), ఎం.శేఖర్​(బీఎస్పీ), బాజిరెడ్డి జగన్మోహన్​(ఇండిపెండెంట్) నామినేషన్లు అందించారు. బాల్కొండ లో వేముల ప్రశాంత్​రెడ్డి(బీఆర్ఎస్), ముత్యాల సునీల్​రెడ్డి (కాంగ్రెస్), పల్లికొండ నర్సయ్య (బీఎస్పీ), ఎం.భోజన్న (డీఎస్పీ) నామినేషన్లు అందించారు. ఆర్మూర్​లో పి.వినయ్​రెడ్డి (కాంగ్రెస్), ఆశన్నగారి జీవన్​రెడ్డి
(బీఆర్ఎస్), ఎస్.కె.మాజీద్​(ఎంబీటీ), తాళ్లపల్లి శేఖరయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ), గండికోట రాజన్న (బీఎస్పీ) నామినేషన్లు దాఖలు చేశారు. బాన్సువాడ నుంచి పరిగె భాస్కర్​రెడ్డి, పందిరి గంగామణి (ఇండిపెండెంట్లు) నామినేషన్లు వేశారు.

కామారెడ్డిలోని నియోజకవర్గాల్లో గురువారం 28 మంది అభ్యర్థులు 31 నామినేషన్లు వేశారు.  కామారెడ్డిలో 14,  జుక్కల్​లో 10, ఎల్లారెడ్డిలో 7 నామినేషన్లు వచ్చాయి. కామారెడ్డిలో  కేసీఆర్​(బీఆర్ఎస్), ఇండిపెండెంట్లు నర్సింలు, హన్మండ్లు, ఆరీఫ్, గబ్బుల నాగేందర్, సుదర్శన్, పి.రాజేశ్, ఖలీలుల్లా, పప్పు రాజు, శివ, పరశురాములు, మాధవ్​రెడ్డి నామినేషన్​వేశారు. జుక్కల్ లో సౌదాగర్​ గంగారాం (కాంగ్రెస్), తోట లక్ష్మీకాంతారావు(కాంగ్రెస్), ఇండిపెండెంట్లుగా   గంగాధర్, కాశీనాథ్, మోహన్, సంజీవ్, నాందేవ్, సాయిలు, లక్ష్మీ నామినేషన్లు​వేశారు. ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్​(బీఆర్ఎస్), సుభాష్​రెడ్డి (బీజేపీ), ఇండిపెండెంట్లుగా బాలరాజు, లక్ష్మయ్య,  శ్రీనివాస్​ నామినేషన్లు​ వేశారు.    

ALSO READ: ఆధార్ కు లింక్ చేయని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్.. ఆర్టీఐ కీలక ప్రకటన