
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా .. ఇప్పుడు రహదారులపై ఉన్న హోర్డింగ్ లపై దృష్టి సారించింది. అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ లను కూల్చేందుకు హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read :- ప్రైవేటు స్కూల్ వాహనాలపై ఆర్టీఏ దాడులు
శంషాబాద్ మున్సిపాల్టీలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన 17 హోర్డింగ్లను గుర్తించారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలు తీసుకోనుంది. అక్రమ హోర్డింగ్ లను వారం రోజుల్లోగా కూలుస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.