బీఆర్ఎస్ నాయకుల పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సహకారంతోనే ఏపీ సీఎం జగన్ తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ సహకారంతో నాగర్జున సాగర్ పైకి ఏకే 47 గన్స్ తో వచ్చారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి శ్రీశైలం నుంచి రోజుకు 12 టీఎంసీ నీళ్లు తోడుకపోవాలని చూస్తుంటే కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా జరిగితే శ్రీశైలంలో బురద కూడా ఉండదని అన్నారు. నిండు కుండలా ఉన్న నీళ్లకు జగన్ మోహన్ రెడ్డి బొక్క పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన రాగి సంకటి తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ :- కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే కృష్ణా నీళ్ల దోపిడి జరిగింది: సీఎం రేవంత్రెడ్డి
కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొట్టాడి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నల్లగొండ జిల్లాకు తెస్తే ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 2014 వరకు 30 కిలోమీటర్ల మేర తొవ్విన టన్నల్ ను పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటున్నర కిలోమీటర్ తొవ్వారని అన్నారు. కల్వకుర్తి, కోయిల్ సాగర్ భీమాసాగర్ పూర్తి చేయలేదని చెప్పారు. కృష్ణా నీటిలో 811 టీఎంసీల్లో 512 టీఎంసీలను ఏపీ వాడుకోవచ్చిన అధికారికంగా అప్పటి సీఎం కేసీఆర్ సంతకం పెట్టారని చెప్పారు. తెలంగాణ హక్కుల పై మరణ శాసనం రాశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.