15 గంటల్లో 6 హత్యలు.. పెరుగుతున్న నేరాలు.. వణుకుతున్న పట్నం

15 గంటల్లో 6 హత్యలు
పెరుగుతున్న నేరాలు.. వణుకుతున్న పట్నం
అర్ధరాత్రి ఇద్దరు ట్రాన్స్ జెండర్ల మర్డర్
ఇద్దరు చిరు వ్యాపారులను గ్రానైట్ రాళ్లతో కొట్టి..
చాదర్ ఘాట్, ఆజంపురాలోనూ హత్యలు

హైదరాబాద్ వరుస హత్యలతో వణుకుతోంది. ఒకే రోజు ఆరు హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.  వరుస దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్ లతో నగరవాసులను దుండగులు హడలెత్తిస్తున్నారు. తాజాగా బుధవారం (జూన్ 21న) 15 గంటల వ్యవధిలో  ఆరుగురు హత్యకు గురయ్యారు.  పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. 

రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు అర్థరాత్రి దాటాక దారుణ హత్యలకు గురయ్యారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో ఇద్దరిని దుండగులు హతమార్చారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరిగాయి. బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తిని, రోడ్డు పక్కన షాప్ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ రాళ్లతో కొట్టి చంపేశారు. 

టప్పాచబుత్రలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి, రియాజ్ అలియాస్ సోఫియా అనే ట్రాన్స్ జెండర్లను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి హతమార్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై జంట హత్యలు కలకలం రేపాయి. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ హత్యలు జరిగాయి. బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తిని, రోడ్డు పక్కన షాప్ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గ్రానైట్ రాళ్లతో కొట్టి.. హతమార్చారు. 

టప్పాచబుత్రలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి, రియాజ్ అలియాస్ సోఫియా లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి హతమార్చారు. ఈ నాలుగు హత్యలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చాదర్ ఘాట్  పోలీస్ స్టేషన్  పరిధిలో మరో హత్య జరగడం గమనార్హం. ఆజంపురాలోనూ గుర్తు తెలియని వ్యక్తిని కొందరు దుండగులు హతమార్చారు.  ఇదిలా ఉండగా నగర శివారులోని ఓ ప్రేమోన్మాది ప్రియురాలిపై హత్యాయత్నం చేశాడు. నార్సింగిలో తనను ప్రేమించలేదని కసితో వాసవి అనే మహిళపై గణేశ్​ నే ఉన్మాది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతోంది.