రామ సేతు .. ‘ఒక యుద్ధం, ఒక ఆయుధం, ఒక కాపలాదారుడు’

రామ సేతు .. ‘ఒక యుద్ధం, ఒక ఆయుధం, ఒక కాపలాదారుడు’

మంచి కథలతో  నిర్మాతగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకున్న అభిషేక్ నామా ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక  స్టోరీని  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘సేతు’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో రామాయణ కథను నిర్మించబోతున్నట్టు ఉగాది రోజున ప్రకటించారు. 

పుష్ప, దసరా వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన హరి కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ఈ మూవీ అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ‘ఒక యుద్ధం, ఒక ఆయుధం, ఒక కాపలాదారుడు’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో పాటు హనుమాన్‌‌‌‌‌‌‌‌ని  చూపించడం   సినిమాపై ఆసక్తిని పెంచింది.   

రామాయణంలోని యుద్ధాలు, వీర గాథలు, త్యాగం, ధర్మబద్ధత వంటి అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను అందిస్తుందని అన్నారు.