ఎండల్లో కొంచెం సేపు బయటికి వెళ్లొచ్చినా ముఖం కందిపోతుంది. చర్మం డల్‌గా కనిపిస్తుంది. అలాంటప్పుడు ముఖం ఫ్రెష్‌గా కనిపించేందుకు ఐస్ ముక్కలు ఉపయోగపడతాయి. రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి ఐస్ థెరపీ చేసుకుంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది. నాలుగైదు ఐస్ ముక్కల్ని మెత్తని క్లాత్‌లో లేదా హ్యాండ్ కర్చీఫ్లో పెట్టాలి. ఐస్ ముక్కలున్న క్లాత్ లేదా కర్చీఫ్‌ను ముఖం మీద గుండ్రంగా తిప్పాలి. ఇలా చేస్తే చర్మం లోపలి కణాలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దాంతో, ముడతలు పోయి చర్మం అందంగా కనిపిస్తుంది. అలసట, ఒత్తిడి వల్ల కళ్ల కింది చర్మం ఉబ్బుతుంది. అప్పుడు కళ్ల కింద ఐస్ ముక్కలతో కొంచెం సేపు రుద్దితే ఆ ఉబ్బు పోతుంది.
మరిన్ని వార్తల కోసం: