వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి పాలవడం అక్కడి మహిళలను కంటతడి పెట్టిస్తోంది. అందులోనూ డొనాల్డ్ ట్రంప్గెలవడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. కమల ఓటమికి, ట్రంప్ విజయానికి మగవాళ్లే కారణమని, వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యిన్రు. వేలాది మంది మహిళలు వినూత్నంగా తమ నిరసనను మగవాళ్లకు రుచిచూపిస్తున్నారు.
సౌత్ కొరియాలో బాగా ప్రచారంలో ఉన్న 4బి ఉద్యమాన్ని అమెరికాలో ప్రారంభించారు. భర్త లేదా ప్రియుడిని దగ్గరికి రానివ్వకుండా ఉండడమే ఈ ఉద్యమం స్పెషాలిటీ. ట్రంప్‌కు ఓటేసినందుకు శిక్షగా పురుషులను మన శరీరాలను తాకనివ్వొద్దంటూ ఆన్ లైన్లో ప్రచారం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడం విశేషం.
ఉద్యమంలో చేరాలంటే తమ భర్త కానీ ప్రియుడితో కానీ లైంగికంగా కలవబోమని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, మగవాళ్లతో సంబంధాలు పెట్టుకోబోమని, వివాహం చేసుకోబోమని ఒట్టుపెట్టుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటువేసి ట్రంప్‌ను గెలిపించినందుకు వాళ్లకు ఇదే శిక్ష అని అంటున్నారు. ‘మై బాడీ, మై చాయిస్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఏంటీ 4 బి..?
సౌత్ కొరియాలో ‘బి’ అంటే వద్దు, చేయొద్దు అని అర్థం. అంటే నాలుగు విషయాలకు నో చెప్పడమన్నమాట. అవేంటంటే.. నో సెక్స్, నో రిలేషన్, నో మ్యారేజ్, నో చైల్డ్ బర్త్.. అయితే, సౌత్ కొరియాలో ఈ ఉద్యమానికి సంబంధించి నియమాలు కఠినంగా ఉన్నాయి. భర్త లేదా ప్రియుడు లేదా పార్ట్నర్ ఉన్న యువతులు, మహిళలు ఈ ఉద్యమంలో చేరడానికి వీల్లేదు.