శరీరం ఆక ర్షణీయంగా.. దృఢంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో జిమ్‌లకు వెళ్లేంత టైమ్ అందరికీ దొరకడంలేదు. అయితే, అలాంటి వారు ఇంట్లోనే కొన్ని వర్కవుట్స్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా ఈ వర్కవుట్స్ చేస్తూ ఉంటే.. చేతులు, కాళ్లలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆ ప్లేస్‌లో స్ట్రాంగ్ మజిల్ డెవలప్ అవుతుంది. మొత్తంగా బాడీ షేప్ అందంగా తయారవుతుంది అంటాడు ఫిట్నెస్ ట్రైనర్ బాబీ.
హై నీస్
నిలబడి.. జంప్ చేసినట్లుగా మోకాల్ని నడుము భాగం కన్నా పైకి లేపాలి. ఇది చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోవాలి. రైట్ లెగ్.. తర్వాత లెఫ్ట్ లెగ్.. ప్రాసెస్‌లో కాళ్లు మార్చుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి. దీని వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది.
బ్రిడ్జ్
నేలపై వెల్లకిలా పడుకుని రెండు కాళ్లను పైకి లేపాలి. చేతులను కూడా పైకి లేపి ఉంచాలి. రెండుకాళ్లను 90 డిగ్రీల పొజిషన్లో నేలకు ఆనించి దూరంగా ఉంచాలి. ఇలా కొద్దిసేపు ఉండటం వల్ల లోయర్ బ్యాక్ లో స్ట్రెంత్ పెరుగుతుంది.
బర్డ్ డాగ్
మోకాళ్లు, చేతుల సపోర్ట్ తో బర్డ్ పోజ్ పెట్టాలి. రైట్ హ్యాండ్ తో పాటు లెఫ్ట్ లెగ్ , లెఫ్ట్ హ్యాండ్ తో పాటు రైట్ లెగ్ ను మారుస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బాడీ బ్యాలెన్స్ బాగా ఉంటుంది.
లెగ్ రైజెస్
నేలపై వెల్లకిలా పడుకుని ఒక కాలును పైకి లేపాలి. ఇలా పైకి లేపి ఉంచే సమయంలో కాలు ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. పైకి లేపిన కాలుతో సర్కిల్స్ అయినా చేయొచ్చు లేదంటే అప్ అండ్ డౌన్ అయినా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల బాడీ స్ట్రాంగ్‌గా ఉంటుంది.
స్క్వాట్
ఫొటోలో కనిపిస్తున్నట్లుగా నిటారుగా నిల్చుని చేతులు రెండూ జోడించి.. గాల్లో గోడ కుర్చీ వేయాలి. కాళ్లను 90 డిగ్రీల కోణంలో వంచాలి. తర్వాత కూర్చుని లేస్తూ ఉండాలి. రోజూ ఇలా చేయడం వల్ల తొడల్లో ఉండే ఫ్యాట్ కరుగుతుంది. తొడ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి.
ప్లాంక్
ఇది బాడీ వెయిట్‌ను బేస్ చేసుకుని చేసే వర్కవుట్. అరచేతుల నుంచి మోచేతుల వరకు రెండింటినీ నేలకు ఆనించాలి. వీటితో పాటు కాళ్లను కూడా నేలకు ఆనించాలి. బరువంతా చేతులు, కాళ్లపై వేసి మెల్లిమెల్లిగా బాడీని పైకి లేపాలి. ఈ ఎక్సర్సైజ్ వల్ల పొట్ట, కాళ్లు యాక్టివేట్ అవుతాయి. ఈ వర్కవుట్‌ను సాధారణ శ్వాస తీసుకుంటూ చేయడం వల్ల పొట్టలోని కండరాలు గట్టిపడతాయి.