
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి మూడు రోజుల్లోనే రూ.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ. లక్షగా ఉన్న ఆటో సెటిల్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ (ఏఎస్‌ఏసీ) పరిమితిని ఐదు రెట్లు పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్ణయించింది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏఎస్‌ఏసీ లిమిట్‌ను మే 2024లో రూ. 50 వేల నుంచి రూ. ఒక లక్షకు ఈపీఎఫ్‌ఓ పెంచింది. వైద్యం, విద్య, వివాహం, గృహ నిర్మాణ అవసరాల కోసం ఏఎస్‌ఏసీ కింద పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకున్న మూడు రోజుల్లోపు పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమవుతాయి. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ సభ్యులు 7.5 కోట్లకు
చేరుకున్నారు.