నాలుగేళ్లలోనే గ్రామాల  రూపురేఖలు మార్చేశా : పుట్ట మధు

మహాముత్తారం, వెలుగు : నాలుగేళ్లలోనే గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని మంథని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుట్ట మధు చెప్పారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పరిధిలోని అటవీ గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లకు 30 ఏళ్లు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయకుండా, ఎన్నికలు రాగానే దొంగ హామీలు, నోట్ల కట్టలతో వస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు మారుమూల గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని, కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారన్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు కల్వచర్ల రాజు, లీడర్లు మందల రాజిరెడ్డి, మార్క రాముగౌడ్, రాధారపు స్వామి, మెండ వెంకటస్వామి, బానోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోడ బాలాడీ ఉన్నారు.