
ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధుకు మెగా గేమ్స్‌లో షాక్ తగిలింది. విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 19–21, 14–21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. 56 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధు రెండో గేమ్‌లో తేలిపోయింది. చైనీస్ ప్లేయర్ కొట్టిన బలమైన షాట్లను తీయలేకపోయింది.
బాడీలైన్, క్రాస్ కోర్టు షాట్లను తీయలేక వరుసగా పాయింట్లు చేజార్చుకుంది. ఆట ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లిన జియావో ఏ దశలోనూ సింధుకు కోలుకునే చాన్స్ ఇవ్వలేదు. బేస్ లైన్ గేమ్‌తో పాటు స్మార్ట్ డ్రాప్‌లతో జియావో ఆకట్టుకుంది. మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–12, 21–6తో తోటి ఆటగాడు హెచ్.ఎస్. ప్రణయ్‌పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మెన్స్ డబుల్స్‌లో మెడల్ ఫేవరెట్స్ సాత్విక్–చిరాగ్ క్వార్టర్స్‌లో 21–13, 14–21, 16–21తో చియా అరోన్–సోహ్ వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడారు.