ఇకపై వారానికి రెండ్రోజులు గాంధీభవన్​కు మంత్రులు

ఇకపై వారానికి రెండ్రోజులు గాంధీభవన్​కు మంత్రులు
  • ప్రతి బుధ, శుక్రవారాల్లో కార్యకర్తలకు అందుబాటులో..
  • రేపట్నుంచే అమలు 

హైదరాబాద్, వెలుగు: ఇకపై గాంధీభవన్ కు ప్రతి వారం ఇద్దరు మంత్రులు రానున్నారు. బుధ, శుక్రవారాల్లో ఒక్కో మంత్రి గాంధీ భవన్ కు వచ్చి.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు గంటల పాటు అక్కడ ఉంటారు. ఇది ఈ శుక్రవారం నుంచే అమలు కానుంది. ప్రతి వారం మంత్రులు గాంధీభవన్ కు రానుండడంతో పార్టీ కేడర్ లో జోష్ రానుంది. ఇటీవల పీసీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన టైమ్ లో మంత్రులు గాంధీభవన్ కు రావాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.

 అందుకు అనుగుణంగానే మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వారానికి రెండ్రోజులు ఇద్దరు మంత్రులు గాంధీభవన్ కు రానుండడంతో వారు ఏం చేయాలి? ఎవరిని కలవాలి? అనే దానిపై విధివిధానాలను రూపొందించాలని సిబ్బందిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలకు రెండుసార్లు గాంధీభవన్ కు రావాలని మహేశ్ కోరారు. దీనిపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.