మూడంటే.. 3 సెకన్లలో కళ్ల ముందు డాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోయింది

మూడంటే.. 3 సెకన్లలో  కళ్ల ముందు డాన్స్ చేస్తూ కుప్పకూలి చనిపోయింది

మూడు అంటే 3 సెకన్లు మాత్రమే.. కళ్ల ఎదుట ఎంతో ఆనందంగా.. ఉత్సాహం డాన్స్ చేస్తున్న యువతి.. డాన్స్ చేస్తూ చేస్తూ కుప్పకూలి చనిపోయింది. డాన్స్ చేస్తున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్.. తీవ్ర గుండెపోటు.. ఏదో మోటార్ ఆఫ్ చేసినట్లు.. గుండె ఠక్కున ఆగిపోయింది. డాన్స్ చేస్తూ పడిపోయిన యువతికి అదే చివరి శ్వాస అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ విషాధ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఓ రిసార్ట్‌లో వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 23 ఏళ్ల యువతి గుండెపోటుతో మరణించింది.  ఇండోర్‌కు చెందిన పరిణిత జైన్ అనే మహిళ తన బంధువు సోదరి వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విదిశకు వచ్చింది.  200 మందికి పైగా అతిథులు హాజరైన 'హల్దీ' ఫంక్షన్‌లో పరిణిత  స్టేజ్ పై డ్యాన్స్ చేస్తుంది.  బాలీవుడ్ పాట 'లెహ్రా కే బల్ఖా కే'కి పరిణిత డ్యాన్స్ చేస్తుండగా ఫిబ్రవరి 8 రాత్రి స్టేజ్ పైనే ఒక్కసారిగా కుప్పకూలింది.ఈ  వీడియో వైరల్ అవుతోంది. 

ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యులు, కుటుంబ సభ్యులు ఆమెకు CPR  చేయడానికి  ప్రయత్నించారు, అయినప్పటికీ ఆమె స్పందించలేదు.  వెంటనే ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు  ప్రకటించారు. MBA గ్రాడ్యుయేట్ అయిన పరిణిత ఇండోర్‌లోని సౌత్ టుకోగంజ్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె తమ్ముళ్లలో ఒకరు కూడా 12 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు.