భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తో అమ్మమ్మ, మనవడు మృతి

భూపాలపల్లి జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తో అమ్మమ్మ, మనవడు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన జరిగింది. కరెంట్ షాక్ తో అమ్మమ్మ, మనవడు అక్కడికక్కడే మృతి చెందారు. మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామంలో ఈ సంఘటన  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  గ్రామంలోని తమ ఇంటి ఆవరణలో కరెంట్ పోల్ కు ఉన్న సర్వీస్ వైర్ కు ప్రమాదవశాత్తు ఇనుప దండెం తాకింది. 

ఇదే సమయంలో ఆరిన బట్టలు తీయడానికి వెళ్లిన అమ్మమ్మ రామలక్ష్మి (55), మనవడు సాయిచరణ్(14) విద్యుత్ షాక్ తగిలింది. దండెం వైర్ కు విద్యుత్ సరఫరా కావడం తో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయల ఆలుముకున్నాయి.