బెంగళూరులో ఘోరం జరిగింది. సహజీవనం చేస్తున్న ట్రాన్స్ జెండర్ ను మహిళ అతి కిరాతకంగా చంపింది. వివరాల్లోకి వెళ్తే మంజు నాయక్, ప్రేమ ఇద్దరు కలిసి తూర్పు బెంగళూరులోని మురుగేష్‌పాళ్య ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 3వ తేదీన ట్రాన్స్ జెండర్ మంజు నాయక్ శెవమై కనిపించింది. నాయక్ సోదరుడు పరసా నాయక్ ఏదో తప్పు జరిగిందనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ మంజు నాయక్‌ను టవల్‌తో గొంతుకోసి అదృశ్యమైందని కంప్లైంట్ చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సర్ సివి రామన్ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి ఊపిరాడక మరణానికి కారణమని నిర్ధారించారు. పోలీసులు మే 7వ తేదీన హత్య కేసు నమోదు చేశారు. బెంగుళూరు ఈస్ట్ పోలీసులు శుక్రవారం ప్రేమను అరెస్టు చేసినట్లు ప్రకటించారు, మే 8న హాసన్ జిల్లాలో, చన్నరాయపట్నం తాలూకాలోని అయ్యరహళ్లి గ్రామంలోని ఆమె తల్లి నివాసంలో ఉందని సమాచారం అందగా వెళ్లి తనిఖీ చేసి ఆమెను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రేమ భర్త మృతి చెందగా బాధితురాలితో కలిసి మురుగేష్‌పాళ్యంలో నివాసం ఉంటుంది. ఏప్రిల్ 26వ తేదీ రాత్రి ప్రేమ, మంజు నాయక్‌ల మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో కోపగించుకున్న నాయక్, తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఈ క్రమంలోనే టవల్‌తో నాయక్‌ను గొంతు పిసికి చంపానని తెలిపింది ప్రేమ.