మంచిర్యాల జిల్లాలో కంట్లో కారం కొట్టి..  బాత్రూంలో బంధించి పుస్తెలతాడు చోరీ

మంచిర్యాల జిల్లాలో కంట్లో కారం కొట్టి..  బాత్రూంలో బంధించి పుస్తెలతాడు చోరీ
  • మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట టౌన్ లో ఘటన

లక్సెట్టిపేట, వెలుగు: మహిళ కంట్లో కారంకొట్టి.. బంధించి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. బాధితురాలు, ఎస్ఐ సతీశ్ తెలిపిన ప్రకారం.. లక్సెట్టిపేట టౌన్ లోని గోదావరి రోడ్డులో ఉండే  కొత్త  శ్యామల ఇంట్లోకి ఆదివారం ఉదయం గుర్తు తెలియని మహిళ చొరబడింది.

ఒంటరిగా ఉన్న శ్యామల కంట్లో కారం కొట్టి.. ఆపై బాత్రూంలోకి లోకి నెట్టేసి.. 3 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని తలుపు పెట్టి పరారైంది. బాధితురాలు కేకలు వేయడం తో స్థానికులు వచ్చి తలుపు తీశారు. శ్యామల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.