పండగ పూట.. ఎగ్ కర్రీ వండలేదని చంపేశాడు

పండగ పూట.. ఎగ్ కర్రీ వండలేదని ఓ వ్యక్తి తప భార్యను చంపేసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పట్టణంలోని టిఆర్ నగర్ లో ఉంటున్న కట్ట సంజయ్.. ఎగ్ కర్రీ విషయంలో తన సుమలత(33)తో గొడవ పెట్టుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న సంజయ్.. పండుగ పూట ఎగ్ కర్రీ ఎందుకు  వండలేదని భార్యపై దాడి చేసి, ఆమె గొంతు నుమిలి చంపేసినట్లు సమాచారం. 

విషయం తెలుసుకున్న  పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.  గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో భార్యభర్తల మధ్య  గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈఘటనపై కేస్ నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ తెలిపారు.

ALSO READ :- సిరిసిల్లలో రోడ్డెక్కిన పద్మశాలీలు.. రాజకీయ పార్టీలకు హెచ్చరిక