
- వరంగల్ సీపీ ఆఫీస్ ఎదుట మహిళా సూసైడ్ అటెంప్ట్
- ఆమెపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు
హనుమకొండ, వెలుగు: భర్తపై పెట్టిన కేసులో రాజీ కి ఒప్పించాలంటూ ఓ మహిళ వరంగల్ పోలీస్‌కమిషనరేట్ వద్ద సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వెంటనే స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన కడావత్ సంగీత రెండు పెళ్లిళు చేసుకోగా వివిధ కారణాలతో వారికి దూరంగా ఉంటూ ముంబైకి వెళ్లిపోయింది. అక్కడ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యా నాయక్ తండాకు చెందిన శ్రీనుతో పరిచయం ఏర్పడింది.
8 ఏండ్ల కింద శ్రీనును మూడో పెండ్లి చేసుకోగా.. కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అనంతరం ఆమె తన తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కేసు పెట్టింది. కాగా.. ఇల్లు, భూమి విషయంలో ఆమెకు కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత మళ్లీ శ్రీను వద్దకే వచ్చి వడ్డేపల్లిలో ఉంటోంది. దీంతో ఇదివరకు భర్తపై పెట్టిన కేసులో తన కుటుంబ సభ్యులను రాజీకి ఒప్పించి, తన భూమి తనకు ఇప్పించాలం టూ బుధవారం సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో వరంగల్ సీపీ ఆఫీస్వద్దకు చేరుకుంది.
అక్కడ ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీస్ సిబ్బంది ఆమెను అడ్డుకుని సర్దిచెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా కేసులో రాజీ కుదర్చాలని, లేదంటే చస్తానంటూ హెడ్ క్వార్టర్స్ ఎదుట న్యూసెన్స్ చేసిన మహిళపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సుబేదారి పోలీసులు తెలిపారు.