బాయ్ ఫ్రెండ్ తో గొడవ జరిగిందని ఓ యువతి రన్నింగ్ లో ఉన్న విమానం అద్దం పగులగొట్టిన ఘటన చైనాలో జరిగింది. చైనాలోని జినిగ్ కు చెందిన 29 ఏళ్ల లీ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి విడిపోయింది. ఆ వెంటనే ఆమె జినిగ్ నుంచి తూర్పు చైనాలోని యాన్చెంగ్కు వెళ్లడానికి లూంగ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. ఫ్లైట్ ఎక్కడానికి ముందు లీ 500 ml మద్యం తాగింది. ఫైట్ బయలుదేరి 30 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు లీ తన బాయ్ ఫ్రెండ్ తో జరిగిన గొడవ గుర్తుకువచ్చి సహనాన్ని కొల్పోయింది. వెంటనే తన పక్కనున్న విమానం అద్దాన్ని చేతిలో కొట్టి పగులగొట్టింది. అది చూసిన తోటి ప్రయాణికులు వెంటనే లీ ను సముదాయించి పట్టుకున్నారు. వెంటనే అప్రత్తమైన పైలట్ విమానాన్ని హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌలో అత్యవసరంగా దించాడు.
జెంగ్జౌ పోలీసుల ప్రకారం.. ‘లీను ఆమె ప్రియుడు వదిలేశాడు. దాంతో ఆమె ఆగ్రహానికి గురయింది. విమానంలో ఎక్కే ముందు లీ ‘బైజియు’ అనే మద్యం అర లీటరు తాగింది. ఈ మద్యంలో ఆల్కహాల్ శాతం 35 నుండి 60 శాతం మధ్య ఉంటుంది. సహనం కోల్పోయిన లీ విమానం అద్దాన్ని పగులగొట్టడానికి పూనుకుంది. అద్దం యొక్క మొదటి పొర పగలగానే.. గమనించిన తోటి ప్రయాణికులు లీ ను రెండవ పొర కూడా పగులకుండా అడ్డుకున్నారు’ అని తెలిపారు.
గ్లాస్ మొత్తం పగిలితే విమానం కూలిపోయేది. గ్లాస్ పూర్తిగా పగలకముందే లీ ను అడ్డుకొని విమానాన్ని దించడంతో.. తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లీ రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ 160mg / 100ml గా నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అయితే లీ ని రిమాండ్‌కు తరలించారో లేదా విమానానికి నష్టం కలిగించినందుకు జరిమానా విధించారో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లీ చేసిన పని తెగ వైరల్ అయింది. లీ తన సీటుపై ఏడుస్తూ.. విండో గ్లాస్ పగులగొట్టడం మరియు తోటి ప్రయాణీకులు ఆమెను అడ్డుకోవడం ఇవన్నీ ఆ వీడియోలో రికార్డయ్యాయి.
For More News..