షాద్ నగర్లో దారుణం..యువతి సజీవ దహనం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణ హత్య జరిగింది. ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓ మహిళను పెట్రోల్ పోసి దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగలబెట్టారు.

స్థానికుల సమాచారంతో ఘటన స్థలాన్నీ పరిశీలించారు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  హత్యకు గురైన యువతిని ప్రియాంక రెడ్డి గా గుర్తించారు. ఆమె వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పెట్ మండలం కొల్లూరు ఆమె పశువుల డాక్టర్ గా పని చేస్తుంది. ఆమె  కుటుంబం శంషాబాద్ లో నివాసముంటుంది. యువతి స్వస్థలం కొల్లాపూర్ నియోజకవర్గంలోని నర్సంపేట.   ఎవరు హత్య చేశారనే దిశగా దర్యాప్తును వేగవంతం  చేస్తున్నామన్నారు.