వరంగల్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో దొరమ్ శారదా అనే ఓ మహిళ కూరగాయలు అమ్ముకుంటుంది. ఆమె భర్త ఐదేళ్ల కిందట మరణించాడు.ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళలను అతి దారుణంగా హత్య చేశారు. అడ్డుకోబోయిన కొడుకుపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తలకు ,శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్, క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ హత్యకు గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో ఎదురు కాల్పులు..మావోయిస్టు మృతి
ఆదిపురుష్ లో ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్
హయ్యెస్ట్..భారత్ లో ఒక్కరోజే 83,883 కేసులు