Viral Video: అది పొట్లకాయ కాదు తల్లీ..పాము..అలా పట్టుకున్నావేంటీ

Viral Video: అది పొట్లకాయ కాదు తల్లీ..పాము..అలా పట్టుకున్నావేంటీ

పాము ఎవరికైనా భయమే..సమీపంలో పాము కనిపిస్తేనే అంత దూరం ఎగిరి గంతేసి దూరంగా పోతాం..ఆమెను చూడండి..రైతు బజారుకు పోయిన పొట్లకాయ పట్టుకొచ్చినట్లు ఈజీగా పామును చేతితో పట్టుకొని సంచిలో వేస్తుంది. ఓ ఆఫీసులో కంప్యూటర్ల మధ్య చొరబడిన పామును పట్టుకునేందుకు సిబ్బంది భయపడిపోతుంటే..ఆ మహిళ ఏదో తీగను లాగినట్లు పామును చేతితో పట్టుకొని గుంజి బయటికి లాగింది. ఒళ్లు గగుర్లు పొడిచే మహిళ పామును పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో బాగా వైరల్ అవుతోంది.నెటిజన్లు ఆమె బోల్డ్నెస్కు  హ్యాట్సాఫ్ చెబుతున్నారు.   

ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు గానీ మహిళ పామును పడుతున్న తీరును నెటిజన్లు తెగమెచ్చుకుంటున్నారు. పామును చూస్తేనే అంత దూరం పారిపోతాం.. రైతు బజారుకెళ్లి పొట్లకాయ పట్టుకొచ్చినట్లు పామును ఇట్ల పటుకుంది ఏందిరా బాబు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు ఆమె స్నేక్ క్యాచర్ అయివుండొచ్చని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ మహిళ బోల్డ్ నెస్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే అంటున్నారు ఇంకొందరు.