
జీడిమెట్ల, వెలుగు: అప్పులు కట్టలేక, ఇతరులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక పేట్బషీరాబాద్పరిధిలో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. వరంగల్‌కు చెందిన శివరాత్రి దేవి (35)కి ముగ్గురు సంతానం. భర్త ఖాళీగా ఉంటుండగా, ఆమె బట్టల వ్యాపారం చేస్తున్నది.
ఏడాది నుంచి వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని కట్టలేక, ఇతరులకు ఇచ్చిన డబ్బులు రాక దేవి కొద్దికాలంగా ఇబ్బందులు పడుతోంది. ఇదే విషయమై ఈ నెల5న కొంపల్లిలోని న్యూజివీడు సమీపంలో తన పుట్టింటికి వచ్చింది. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్నహెయిర్కలర్తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 6న తెల్లవారుజామున మృతి చెందింది.
అనుమానాస్పద స్థితిలో మరొకరు
సూరారంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందాడు. దేవేందర్నగర్కి చెందిన శంకర్ (29) ప్రైవేట్ జాబ్చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో భోజనం చేసి పడుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు లేచేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించాడు. ఈ విషయమై బంధువులు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.