సెల్ఫీ వీడియో తీసుకొని మహిళ సూసైడ్

సెల్ఫీ వీడియో తీసుకొని మహిళ సూసైడ్

ఖమ్మం రూరల్, వెలుగు: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరం బ్యాంక్​కాలనీకి చెందిన శ్రీకల్యాణి ఉరఫ్​ కావ్య(32)హోటల్​మేనేజమెంట్ పూర్తి చేసి ఓ హోటల్‎లో పని​చేస్తుంది. నగరంంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన వేల్పుల అభిలాశ్(24) అనే డ్యాన్స్​మాస్టర్‎ను ప్రేమిస్తున్నానని రెండేండ్ల కింద తండ్రి శ్రీనివాసరావుతో చెప్పగా, తండ్రి అంగీకరించలేదు. కావ్య తండ్రి మాట వినకుండా అభిలాశ్‎తో సహజీవనం చేస్తోంది. శనివారం ఇద్దరూ కలిసి అభిలాశ్​ అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్​మండలం పొన్నెకల్లు వెళ్లారు. 

తాను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని, నువ్వు వెళ్లిపోవాలని కావ్యకు చెప్పగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపం చెందిన కావ్య తన చావుకు అభిలాశ్​కారణమని, తనను మోసం చేశాడని సెల్ఫీ వీడియో తీసుకొని, ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఎస్​హెచ్​వో రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.