కరెంట్ కట్ చేశారని యువతి సూసైడ్

కరెంట్ కట్ చేశారని యువతి సూసైడ్

బిల్లు కట్టలేదని కరెంట్ కట్
మనస్తాపంతో యువతి సూసైడ్

భీమిని, వెలుగు: కరెంట్ బిల్లు కట్టలేదని అధికారులు కనెక్షన్ కట్ చేయడంతో మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కారెం సత్తయ్య నాలుగేళ్లుగా కరెంట్ బిల్లు కట్టడం లేదు. ప్రస్తుతం రూ.32 వేల వరకు బకాయి ఉంది. గురువారం మధ్యాహ్నం బిల్లుల వసూలు కోసం అధికారులు సత్తయ్య ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సత్తయ్య ఇంట్లో లేకపోవడంతో అతని కూతురు అన్నపూర్ణను (20) కరెంట్ బిల్లు వెంటనే కట్టాలని కోరారు. కట్టకపోవడంతో కనెక్షన్
కట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అన్నపూర్ణ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

For More News..

అంబులెన్స్ రాలేక.. వాగు దాటేసరికి పానం పోయింది