తలనొప్పి తగ్గట్లేదని సూసైడ్

కూకట్ పల్లి, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ యువతి సూసైడ్ చేసుకున్న ఘటన కేపీహెచ్​బీ పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని విజయవాడకు చెందిన పాలపర్తి శాంతి శ్రీ(26) కేపీహెచ్ బీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ సెకండ్ ఫేజ్​లోని ఓ లేడీస్ హాస్టల్​లో ఉంటోంది. బాలానగర్​లోని ఎంఈఐఎల్​ ఫ్యాక్టరీలో ఇంజినీర్​గా పనిచేస్తోంది. శాంతిశ్రీ కొన్నేండ్లుగా తలనొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం శాంతిశ్రీకి విజయవాడ నుంచి తల్లి కాల్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో శాంతిశ్రీ తల్లి సిటీలోనే ఉంటోన్న తన రెండో కూతురు రత్నశ్రీకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ టైమ్​లో వికారాబాద్​లో ఉన్న రత్నశ్రీ హాస్టల్ నిర్వాహకులకు కాల్ చేసింది. హాస్టల్ సిబ్బంది శాంతిశ్రీ రూమ్​కి వెళ్లి చూడగా.. ఆమె ఉరేసుకుని ఉండటంతో విషయాన్ని రత్నశ్రీకి చెప్పారు.  సాయంత్రం 5 గంటలకు రత్నశ్రీ హాస్టల్ దగ్గరికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకుని శాంతిశ్రీ రాసిన సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పి, అనారోగ్య సమస్యలతో సూసైడ్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్​లో ఉందని పోలీసులు తెలిపారు. మృతురాలి చెల్లెలు  రత్నశ్రీ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేట్​బషీరాబాద్​లో మహిళ..
జీడిమెట్ల : మహిళ సూసైడ్ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. కొంపల్లిలోని తెలుగుబస్తీకి చెందిన  గంగుల రామలక్ష్మీ(42) ప్రైవేటు జాబ్ చేసేది. కొంతకాలంగా ఆమెకు మతిస్తిమితం సరిగా ఉండటం లేదు. మెడిసిన్స్ వాడిన ఆమె ఆరోగ్యం బాగుపడలేదు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో రామలక్ష్మి ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైశారు.