జీడిమెట్ల : పరీక్షలో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో యువతి సూసైడ్ ఘటన హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో జరిగింది. ఎస్సై రామ్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లికి చెందిన రామారావు కూతురు పూజిత(22) డిగ్రీలో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటోంది.
ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బుధవారం బెడ్రూంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుంది. తల్లి ఉమాదేవి గమనించి కూతురిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. పూజిత మార్గమధ్యలోనే చనిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.