గోదావరిఖని, వెలుగు : అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడిగినందుకు గోదావరిఖనిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన జంగా మనెమ్మ(39) బిడ్ల పెళ్లి కోసం గౌతమీనగర్‌కు చెందిన కొమురయ్య వద్ద రూ.10లక్షలు అప్పు తీసుకుంది. ఈ డబ్బుకు నెలనెలా వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే అప్పుగా ఇచ్చిన మొత్తం ఇవ్వాలని కొమురయ్య, అతని కుటుంబ సభ్యులు ఈనెల 22న మనెమ్మ ఇంటికి వచ్చి అడిగారు.
కొద్దిరోజుల్లో ఇస్తానని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. కాగా అప్పు విషయమై మదనపడుతూ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మంగళవారం చనిపోయింది. మృతురాలి పెద్ద కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ ఆర్.స్వామి తెలిపారు.