నార్కట్​పల్లి మండలంలో టెట్​ బాగా రాయలేదని మహిళ సూసైడ్

నార్కట్​పల్లి,వెలుగు:  టెట్​ బాగా రాయలేదనే మనస్తాపంతో మహిళ సూసైడ్​ చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని బాజకుంట గ్రామంలో జరిగింది. పోలీసు తెలిపిన ప్రకారం.. చిల్లర ఉమ (24) ఈనెల 15న టెట్  సరిగా రాయలేదని తీవ్ర మనస్తాపం చెందింది.  సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. 

కుటుంబ సభ్యులు  చికిత్స నిమిత్తం నల్గొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం  ఉమ మృతి చెందింది. మృతురాలి తండ్రి పల్లెగొర్ల ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదా బాబా తెలిపారు.