నల్లబెల్లి, వెలుగు: పోలీసు స్టేషన్ క్వాటర్స్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ చికిత్సపొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన మహిళా కానిస్టేబుల్జోరుక ధరణి(25) నల్లబెల్లి పీఎస్ లో విధులు నిర్వహిస్తుంది. సోమవారం స్టేషన్హెడ్ క్వాటర్స్ లో ప్రమాదశాత్తు జరిగిన విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ లో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
చికిత్స కోసం నల్లబెల్లి పోలీసులు వరంగల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ ధరణి మంగళవారం సాయంత్రం చనిపోయింది. ఆమెకు పెండ్లి కాలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రశాంత్‌బాబు చెప్పారు.