ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ లవర్స్ పట్ల తమ ప్రేమను వ్యక్తీకరించడానికి అనేక ప్రత్యేకమైన మార్గాలను కనుగొంటూ ఉంటారు. వారు తమ పార్ట్ నర్ కి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి వెరైటీ పనులు చేయండ ఇప్పటికే వచ్చిన అనేక వీడియోలు ఇంటర్నెట్లోనూ ఉన్నాయి. అయితే ఐదేళ్ల తర్వాత కలుసుకున్న తన ప్రియుడిపై ఓ మహిళ తన ప్రేమను అందంగా వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ క్లిప్‌లో, మహిళ తన ప్రియుడిని స్వాగతించడానికి కెనడాలోని విమానాశ్రయంలో డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ట్రాలీ నిండా సామానుతో విమానాశ్రయంలో దిగిన వ్యక్తిని చూపించడంతో క్లిప్ ప్రారంభమవుతుంది. అంతలోనే కొంతమంది అతనికి స్వాగతం పలికి, గులాబీలను కూడా అందజేస్తారు. అతను బయటకు వెళ్ళేటప్పుడు, తన ప్రియురాలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. చివరగా, ఆమె అతని ముందు కనిపించింది. షేర్షా చిత్రంలోని 'రాతన్ లంబియాన్'పై డ్యాన్స్ ద్వారా అతనికి స్వాగతం పలికింది. దీంతో ప్రియుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆమెను మెచ్చుకుంటూ కౌగిలించుకోవడానికి వేచి చూస్తూ కనిపించాడు.
Also read :- డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
టొరంటోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అయిన నికి షా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "సుదూర సంబంధాలు సాధారణమైన వాటిలాగే అనిపించినా అద్భుతంగా ఉంటాయి. దాన్ని నేను నిరూపిస్తాను" అని ఆమె రాసింది. ''వాస్తవమేమిటంటే, నాన్‌లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్కి కూడా టన్నుల కొద్దీ సమస్యలు ఉంటాయి. ప్రతి జంటకు సమస్యలు ఉంటాయి. అవి ముందే చెప్పి రావు. కానీ ఇద్దరు వ్యక్తులు దాన్ని పరిష్కరించడానికి కట్టుబడి ఉంటేనే సంబంధాలు మనుగడలో ఉంటాయి అని ఆమె చెప్పింది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనికి ఇప్పటివరకు దాదాపు 3మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.